మిన్స్క్: ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్‌ను బెలారస్ కూల్చివేసింది. ఈ అంశంలో ఉక్రెయిన్ అంబాసిడర్‌కు బెలారస్ సమన్లు కూడా జారీ చేసింది. ఓ నిర్జన ప్రదేశంలో ఆ క్షిపణి శిథిలాల పడి ఉన్న దృశ్యాలను స్థానిక టీవీల్లో ప్రసారం చేశారు. రష్యా మిత్ర దేశమైన బెలారస్ ఈ ఘటన పట్ల సీరియస్‌గా ఉంది. ఎస్-300 రాకెట్‌కు సంబంధించిన పూర్తి విచారణ చేపట్టాలని బెలారస్ ఆ దేశాన్ని కోరింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత.. తొలిసారి ఉక్రెయిన్ మిస్సైల్‌ను బెలారస్ షూట్ చేసింది.