కాకిని కాపాడిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
Crow | అడవి జంతువులు తమకు కనిపించిన వాటన్నింటిని తినేస్తుంటాయి. ఎలుగుబంటి కూడా అంతే. తనకు కనిపించిన జంతువులు, పక్షులపై దాడి చేసి భక్షిస్తాయి. కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ కాకిని ఎలుగుబంటి ప్రాణాలతో రక్షించింది. ఈ
Crow | అడవి జంతువులు తమకు కనిపించిన వాటన్నింటిని తినేస్తుంటాయి. ఎలుగుబంటి కూడా అంతే. తనకు కనిపించిన జంతువులు, పక్షులపై దాడి చేసి భక్షిస్తాయి. కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ కాకిని ఎలుగుబంటి ప్రాణాలతో రక్షించింది. ఈ దృశ్యం హంగేరిలోని బుదాపేస్ట్ జూలో కనిపించింది.
ఓ కొలను ఒడ్డు వద్ద కాకి ఎగురుతూ నీటిలో పడిపోయింది. అక్కడే ఓ ఎలుగుబంటి సంచరిస్తూ ఉంది. నీటిలో పడిపోయిన కాకి అరుస్తుంది. అప్రమత్తమైన ఎలుగుబంటి ఆ కాకి వద్దకు వెళ్లింది. నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి రక్షించింది. తన నోటి సాయంతో కాకి రెక్కలను ఎలుగుబంటి పట్టుకుని బయటకు తీసింది. అనంతరం ఎలుగుబంటి ఆహారం కోసం మరో చోటుకు వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కాకి అక్కడ్నుంచి ఎగిరిపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 4.5 మిలియన్ల మంది వీక్షించారు. లక్షల మంది లైక్ చేశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాకిని ప్రాణాలతో కాపాడిన ఎలుగుబంటిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Footage from Aleksander Medveš shows Vali, a bear at the Budapest Zoo, saving a drowning crow.pic.twitter.com/KbHNhkeiOI
— Fascinating (@fasc1nate) October 28, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bear
- Crow
- Hungary
- pond in zoo
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

