Adani | గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ.. విద్యుత్తు ఒప్పందాలను సమీక్షిస్తామన్న బంగ్లాదేశ్
గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్‌తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ఇప్పటికే కెన్యా ప్రకటించగా, తాజాగా బంగ్లాదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.
- విద్యుత్తు ఒప్పందాలను సమీక్షిస్తామని ప్రకటన
- ఇప్పటికే ఒప్పందాలను రద్దు చేసుకున్న కెన్యా
- అదానీ అమెరికా కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్
- ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్
Adani | ఢాకా : గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్‌తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ఇప్పటికే కెన్యా ప్రకటించగా, తాజాగా బంగ్లాదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అదానీ కంపెనీతో మునుపటి హసీనా ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందాన్ని సమీక్షించనున్నట్టు తాజాగా తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. విద్యుదుత్పత్తి ఒప్పందాలను సమీక్షించేందుకు లీగల్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నియమించాలని విద్యుత్తు, ఇంధనం, ఖనిజ వనరుల శాఖపై జాతీయ సమీక్షా కమిటీ సిఫారసు చేసిందని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ ప్రస్తుతం ఏడు మేజర్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో అదానీ గ్రూప్ యాజమాన్యంలోని బీఐఎఫ్‌పీసీఎల్ 1234.4 మెగావాట్ల కంపెనీ కూడా ఉన్నట్లు వివరించింది.
సుప్రీంకు చేరిన అదానీ ‘అమెరికా’ కేసు
పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ పిటిషన్‌ను అడ్వకేట్ విశాల్ తివారీ దాఖలు చేశారు. అదానీ గ్రూప్ స్టాక్ ధరల మాయాజాలానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ భారత్‌లో సౌర విద్యుత్తు కాంట్రాక్టులను పొందడం కోసం కొందరు నేతలకు రూ.2,200 కోట్ల మేరకు లంచాలు ఇచ్చినట్లు అమెరికా న్యాయ శాఖ తాజాగా ఆరోపించింది. దీనిపై అమెరికన్ కోర్టు సమన్లు కూడా పంపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. అన్ని చట్టాలకు అనుగుణంగానే కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. విశాల్ తివారీ తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో, అదానీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని చెప్పారు. వీటిపై భారతీయ వ్యవస్థల చేత దర్యాప్తు చేయించాలని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

