Bangladesh curfew: బంగ్లాదేశ్లో కర్ఫ్యూ.. 105కు చేరిన మృతుల సంఖ్య
Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్లో యువత భగ్గుమంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్(Bangladesh)లో యువత భగ్గుమంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ(Curfew) విధించారు. విద్యార్థి నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 105 మంది మరణించారు. మరో వైపు బంగ్లాదేశ్లో ఉన్న 245 మంది భారతీయ పౌరులు స్వదేశం తిరిగి వచ్చారు. బంగ్లాలో గత మూడు వారాల నుంచి నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. శాంతియుత పరిష్కారం కోసం విద్యార్థులు ప్రభుత్వంతో చర్చలు నిర్వహించాలని ప్రధాని షేక్ హసీనా తెలిపారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం 1971లో జరిగిన యుద్ధంలో మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లలో 30 శాతం కోటా కల్పిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి వర్సిటీల విద్యార్థులు, ప్రజలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు బుధవారం రెండు బస్సులకు నిప్పు పెట్టారు.
ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రబ్బరు బులెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొన్నిచోట్ల అధికార అవామీ లీగ్ విద్యార్థి సంఘం నాయకులు.. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు జరిగాయి. గురువారం రాంపురా ప్రాంతంలోని టెలివిజన్ భవన్లో మీడియా ప్రతినిధులతో సహా చాలామంది చిక్కుకుపోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

