శాన్‌జోస్, జనవరి 30: కోస్టారికాలోని పోయస్ అగ్నిపర్వతం ముఖ ద్వారం దగ్గర ఏర్పడిన సరస్సులో కూడా బ్యాక్టీరియాలు జీవించి ఉన్నట్టే, మార్స్ మీద విపరీత ఉష్ణోగ్రతలు, వాతావరణాన్ని తట్టుకొని కూడా జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ బ్యాక్టీరియాపై పరిశోధనలను మార్స్‌పై జీవానికి లింక్ చేస్తున్నారు. మార్స్‌పై ఒకవేళ జీవం ఉండి ఉంటే ఆ జీవులు ఎలా ఉంటాయన్నదానిపై పరిశోధనలు చేస్తున్నారు. పోయస్ అగ్నిపర్వత సరస్సులోని నీళ్లు తీవ్ర ఆమ్లత్వం కలిగి ఉంటాయి. అగ్ని పర్వతం పదే పదే పేలుతూ ఉండటం వల్ల మరుగుతుంటాయి. సరస్సులో అనేక లోహ రసాయనాలుంటాయి. అయినప్పటికీ ఇక్కడ కొన్ని రకాల బ్యాక్టీరియాలు జీవించి ఉండటాన్ని శాస్త్రవేత్తలు 2013లో గుర్తించారు. ఇందులో ప్రధానమైంది యాసిడిఫిలియం బ్యాక్టీరియా.