Boris Johnson on Rishi Sunak | రిషి సునాక్ తప్ప ఎవరైనా ఓకే.. బ్రిటన్ భావి ప్రధాని ఎన్నికపై బోరిస్ జాన్సన్ వ్యూహం?!
Rishi Sunak | తన వారసుడిగా రిషి సునాక్‌ను తప్ప మరెవరినైనా ఎన్నుకోవాలని టోరీలకు బోరిస్ జాన్సన్ చెబుతున్నట్లు సమాచారం.
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్ మరో ఐదుగురు మధ్య పోటీ సాగుతున్నది. మలి విడుత అంతర్గత పోలింగ్‌లోనూ రిషి సునాక్ 101 మంది ఎంపీల మద్దతుతో టాప్‌లో కొనసాగుతున్నారు. కానీ, ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం రిషి సునాక్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నది. `ఎవరినైనా ఎన్నుకోండి.. రిషి సునాక్ తప్ప` అని తన మద్దతు దారులకు బోరిస్ జాన్సన్ హితబోధ చేస్తున్నారని టైమ్స్ ఒక వార్తా కథనం ప్రచురించింది.
ఈ నెల ఏడో తేదీన బ్రిటన్ ప్రధానిగా, అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్.. టోరీల పార్టీ నాయకుడిగా రిషి సునాక్‌ను ఓడించాలని సొంత పార్టీ ఎంపీలను, కన్జర్వేటివ్ పార్టీ శ్రేణులను అభ్యర్థిస్తున్నట్లు ఆ వార్తా కథనం సారాంశం. సొంత కన్జర్వేటివ్ పార్టీలో తాను ఎంపీల మద్దతు కోల్పోవడానికి రిషి సునాక్ కారణం అని బోరిస్ జాన్సన్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే బోరిస్ జాన్సన్ బహిరంగంగా ఏ ఒక్కరి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం గానీ, బహిరంగంగా పోటీలో జోక్యం చేసుకోరని సమాచారం. పోటీ నుంచి ఉద్వాసనకు గురైన అభ్యర్థులతో మాట్లాడుతూ తనకు మద్దతు ఇవ్వాలని, రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిని కానివ్వవద్దని చెబుతున్నట్లు తెలిసింది. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ అభ్యర్థిత్వం పట్ల జాన్సన్ చాలా ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాల కథనం. లిజ్ ట్రస్ అభ్యర్థిత్వాన్ని జాన్సన్ వ్యతిరేకులు జాకబ్ రీస్ మోగ్, నదీన్ డొర్రీస్ ఆమోదించారు.
వాణిజ్యశాఖ సహాయ మంత్రి పెన్నీ మొర్డాంట్ అభ్యర్థిత్వాన్ని కూడా బహిరంగంగా సమర్థిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన టీం అంతా `రిషి సునాక్ తప్ప ఎవరైనా సరే anyone but Rishi అనే నినాదంతో రహస్య క్యాంపెయిన్ చేపట్టినట్లు సమాచారం. ఆర్థిక మంత్రిగా రిషి సునాక్ రాజీనామా తర్వాతే.. ప్రధానిగా తాను వైదొలగాల్సి వచ్చిందని బోరిస్ జాన్సన్ గట్టిగా విశ్వసిస్తున్నారని వినికిడి. రిషి సునాక్ వల్లే మరో మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేశారని జాన్సన్ టీం నమ్మకంతో ఉందని తెలుస్తున్నది. ఇదంతా కొన్ని నెలలుగా రిషి సునాక్ చేస్తున్న కుట్ర, ప్లానింగ్ అని భావిస్తున్నట్లు సమాచారం. కానీ, రిషి సునాక్ టీం మాత్రం ఈ వార్తలను కొట్టి పారేసినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

