Face Mask | కరోనా భయంతో పసివాడికి మాస్కు.. చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు
ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ భయంతో చాలా దేశాల్లో మరోసారి మాస్కు తప్పనిసరి చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇలాగే న్యూజిల్యాండ్‌లో కూడా తాజాగా ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే వాళ్లందరూ మాస్కులు ధరించాలని ప్రభుత్వం చెప్పింది.
12 సంవత్సరాలు పైబడ్డ వారంతా సాధారణ మాస్కులు ధరించాలని, చిన్నపిల్లలు ఉంటే వాళ్లకు సరిపోయే మాస్కులు వేయాలని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. ఈ క్రమంలో ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తున్న విమానంలో తన చిన్నారికి ఒక తల్లి వేసిన మాస్కు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఆ పసికందును జాండెర్ ఆపర్మ్యాన్ అనే వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘‘ఈ పసికందు ఎంత సంతోషంగా నవ్వుతూ ఉందంటే.. విమానం దిగే సమయం అంతా సరదాగా గడిచిపోయింది’’ అని పోస్టు పెట్టాడు. ఈ ఫొటోలోని పసికందుకు పెద్ద వాళ్లు వేసుకునే మాస్కు వేసిందా తల్లి. అది ఆ పసివాడి మొఖమంతా కవర్ చేసేయడంతో కళ్ల వద్ద రెండు చిన్న రంధ్రాలు చేసింది.
దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేదో హారర్ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లుంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ ప్రపంచానికి అప్పుడే ‘సూపర్ బేబీ’ అవసరం లేదంటూ జోకులు పేలుస్తున్నాయి. అదే సమయంలో చిన్న పిల్లలకు అలా మాస్కులు వేయకూడదని, అది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

