Omicron Sub Variant | ఒమిక్రాన్ కంటే ఒకటిన్నర రెట్లు వేగంగా సబ్‌వేరియంట్ వ్యాప్తి..!
Omicron Sub Variant | ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అల్లాడిస్తున్నది. దీంతో ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ థర్డ్ వేవ్‌కు ఈ వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ (BA.2)ను గుర్తించిన విషయం తెలిసిందే. సెల్త్ ఒమిక్రాన్ అసలైన.. ఒమిక్రాన్ వేరియంట్ కంటే వేగంగా ఒకటిన్నర రెట్లు వేగంగా వ్యాపిస్తుందని డానిష్ పరిశోధకుల అధ్యయనంలో

లండన్ : ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అల్లాడిస్తున్నది. దీంతో ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ థర్డ్ వేవ్‌కు ఈ వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ (BA.2)ను గుర్తించిన విషయం తెలిసిందే. సెల్త్ ఒమిక్రాన్ అసలైన.. ఒమిక్రాన్ వేరియంట్ కంటే వేగంగా ఒకటిన్నర రెట్లు వేగంగా వ్యాపిస్తుందని డానిష్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. B.1.1.529 (ఒమిక్రాన్)కు బీఏ.1, బీఏ.2, బీఏ.3 మూడు సబ్వేరియంట్లు ఉన్నాయి. డెన్మార్క్ స్టాటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ (SSI) పరిశోధకులు బీఏ.1 కంటే బీఏ.2 వేరియంట్ ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారని న్యూస్‌వీక్ పేర్కొంది. వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని, సబ్ వేరియంట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగానే ఉంటే మునుపటి అంచనాలతో పోల్చితే ఫిబ్రవరి వరకు మరింత విస్తరిస్తుందని ఎస్ఎస్ఐ నిపుణుడు టైరా గ్రోవ్ క్రాస్ పేర్కొనట్లు న్యూస్‌వీక్ పేర్కొంది.
సబ్‌వేరియంట్ (BA.2) ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి అమెరికాలో 127 కేసులు నమోదవగా.. అమెరికాలోని దాదాపు సగం నగరాల్లో సెల్త్ వేరియంట్ జాడలు కనిపించాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శుక్రవారం ఒక ప్రకటనలో అమెరికాలో సెల్త్ వేరియంట్ వ్యాప్తి తక్కువగానే ఉందని తెలిపింది. ఈ నెల 26 నాటికి, బీఏ.1 ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ ఒమిక్రాన్ సబ్ వేరియంట్.
ఆ సమయంలో 98శాతం కేసులున్నాయని ఎస్ఎస్ఐ తెలిపింది. కానీ, బీఏ.2 త్వరగా వ్యాప్తి చెంది.. డెన్మార్క్‌లో ఆధిపత్యం చూపుతున్నది. బీఏ.2, బీఏ.1కంటే తీవ్రంగా ఉందని ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ.. రెండు సబ్వేరియంట్లు.. వారి ఉత్పరివర్తనాల్లో చాలా తేడాలున్నాయని పేర్కొంది. బీఏ.2 వేరియంట్లోని స్పైక్ ప్రొటీన్‌లోని కీలకభాగంపై ఐదు ప్రత్యేక ఉత్పరివర్తనాలు ఉన్నాయని, వాటి తద్వారా వైరస్ మానవుల్లోని కణాలకు చేరి ఆ తర్వాత దాడి చేస్తుందని.. కొవిడ్ వేరియంట్ సర్వైలెన్స్ డెన్మార్క్ కమిటీ చైర్మన్ ట్రోల్స్ లిల్లేబెక్ సీఎన్బీసీకి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

