కాలిఫోర్నియా: ప్రస్తుతం వినియోగిస్తున్న శీతలీకరణ విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు అమెరికాలోని లారెన్స్ బార్కిలీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు.
ప్రస్తుత పద్ధతి గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్నందున, దీనికి ప్రత్యామ్నయంగా ‘అయోనోకలొరిక్ కూలింగ్’ అనే పద్ధతిని వీరు రూపొందిస్తున్నారు. రోడ్లపై కురిసి గడ్డకట్టిన మంచును కరిగించడానికి ఉప్పును వినియోగిస్తారని, ఈ టెక్నికే తమ కొత్త శీతలీకరణ విధానానికి మూలమని తెలిపారు. ఇది పర్యావరణహితమని తెలిపారు.