లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సోమవారం బ్రిటన్లో వేలాది విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. ఏటీసీ వ్యవస్థ కుప్పకూలిందని అధికారులు ప్రకటించారు. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడినట్టు బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎన్ఏటీఎస్) ప్రకటించింది. దీంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి.