USA | హెచ్-4 వీసాదారులకు ‘ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్’.. త్వరలో ఆమోదించనున్న బైడెన్ సర్కార్
అమెరికాలోని భారతీయులకు శుభవార్త. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏండ్లలోపు వయసున్న పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే కీలక బిల్లును బైడెన్ సర్కారు త్వరలో ఆమోదించనున్నది.
USA | వాషింగ్టన్: అమెరికాలోని భారతీయులకు శుభవార్త. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏండ్లలోపు వయసున్న పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే కీలక బిల్లును బైడెన్ సర్కారు త్వరలో ఆమోదించనున్నది. దీంతో దాదాపు లక్ష మంది హెచ్-4 వీసాదారులకు (హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు) ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ లభిస్తుంది.
ఇందుకు సంబంధించిన జాతీయ భద్రతా ఒప్పందాన్ని అమెరికా పార్లమెంట్లో ఆమోదించాలని అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీల నాయకులు అంగీకారానికి వచ్చారు. అమెరికా సెనేట్‌లో ఆదివారం ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ అంగీకారం కుదిరింది. దీంతో 21 ఏండ్ల కంటే అధిక వయసున్న దాదాపు 2.5 లక్షల మంది హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వేల మంది భారత వృత్తి నిపుణులకు ఇది ఎంతో ప్రయోజనకరమైన బిల్లు. ఈ బిల్లు అమలైతే వచ్చే ఐదేండ్లపాటు ఏటా 1,58,000 మందికి గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. అలాగే ఏటా దాదాపు 25 వేల మంది కే-1, కే-2, కే-3 వలసేతర వీసాదారుల (అమెరికా పౌరుల కాబోయే జీవిత భాగస్వాములు లేదా జీవిత భాగస్వాములు, పిల్లల)తోపాటు లక్ష మంది హెచ్-4 వీసాదారులకు వారి జీవిత భాగస్వాములు పనిచేసే ప్రాంతాల్లోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం లభిస్తుందని యూఎస్ అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

