సిడ్నీ, మే 10: బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని తాను ఛేదించినట్టు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కార్ల్ క్రూస్జెల్నిక్కీ ప్రకటించారు. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ కానే కాదని, అది ఒక ఊహ మాత్రమేనని పేర్కొన్నారు.
సముద్రాల్లో మిగతా ప్రాంతాల్లో మునిగిపోయే ఓడలు, జరిగే ప్రమాదాల సంఖ్యతో పోల్చితే బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ప్రమాదాలు ఎక్కువేం కాదన్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ఉన్న ప్రాంతం వాణిజ్యపరంగా చాలా రద్దీ ఉన్న ప్రాంతం అని ప్రమాదాలు సహజమేనని చెప్పారు.