ఆస్ట్రేలియా ‘గోల్డెన్ వీసాలు’ రద్దు
విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా (ఎస్ఐవీ)గా పిలిచే ఈ పథకం కింద విదేశీ ఇన్వెస్టర్లు ఆ దేశంలో నివసించే వెసులుబాటు ఉంది.
- వృత్తి నిపుణులకు మరిన్ని వీసాలు
- భారతీయులపై ప్రభావం తక్కువే!
సిడ్నీ, జనవరి 23: విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా (ఎస్ఐవీ)గా పిలిచే ఈ పథకం కింద విదేశీ ఇన్వెస్టర్లు ఆ దేశంలో నివసించే వెసులుబాటు ఉంది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో దీనిని రద్దు చేస్తున్నట్టు ఆ దేశ హోం శాఖ మంత్రి క్లేర్ ఓ నీల్ ప్రకటించారు. దాని స్థానంలో వృతి నిపుణులకు ఇచ్చే వీసాల సంఖ్యను పెంచుతున్నట్టు తెలిపింది.
దేశంలో పెట్టుబడులను పెట్టే వారిని ఆకర్షించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం గోల్డెన్ వీసాను 2012లో ప్రవేశపెట్టింది. 5 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ఆ దేశంలో పెట్టుబడిగా పెడితే వారికి గోల్డెన్ వీసా లభిస్తుంది. అయితే దీని ద్వారా అవినీతి సొమ్ము వస్తున్నదని ఆ దేశంలో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ విమర్శలకు తోడు దాని నుంచి ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాకపోవడంతో దానిని రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని ప్రభావం భారతీయులపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో గోల్డెన్ వీసా కింద పెట్టుబడులు పెట్టిన వారిలో చైనా దేశీయులు 85 శాతంతో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్ 17వ స్థానంలో ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

