Chile Forest Fires | చిలీ ఫారెస్ట్ లో ఆగని మంటలు.. 116 మంది మరణం.. భారీగా ఆస్తి నష్టం
Chile Forest Fires | చిలీ అడవుల్లో రగిలిన కార్చిచ్చుతో మరణించిన వారి సంఖ్య 115 మందికి చేరుకున్నది. సుమారు 1600 ఇండ్లు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
Chile Forest Fires | చిలీ అడవుల్లో రగిలిన కార్చిచ్చు కొనసాగుతున్నది. దీనివల్ల మరణించిన వారి సంఖ్య 115 మందికి చేరుకున్నది. సుమారు 1600 ఇండ్లు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరణాల సంఖ్య, దగ్ధమైన ఇండ్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని చిలీ అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా చెప్పారు. వాల్పారాయిసో ప్రాంత అడవుల్లో ప్రాణాంతక కార్చిచ్చు రగులుతున్నది. అయితే ప్రజలను తమ ఇండ్లలోనే ఉండాలని, అంబులెన్సులు, ఫైరింజన్లు, ఇతర ఎమర్జెన్సీ వాహనాల ద్వారా వారిని తరలిస్తామని చెప్పారు. కానీ ఎంత మంది మరణించారన్న సంగతి మాత్రం తోహా వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.
శుక్రవారం నుంచి మొదలైన కార్చిచ్చు వల్ల క్విల్పౌ, విల్లా అలెమనా పట్టణాలకు సమీపంలోని అడవుల్లో కార్చిచ్చు రగులుకున్నదని తోహా చెప్పారు. అగ్ని కీలల వల్ల కోస్టల్ రిసార్ట్ టౌన్ వినా డీల్ మార్ చుట్టుపక్కల ఇండ్లు దెబ్బ తిన్నాయి. విల్లా ఇండెపెండెన్సియా ప్రాంతంలోని పలు బ్లాకుల్లో గల ఇండ్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కార్లు పేలిపోవడంతోపాటు పగిలిన విండోలతో వీధుల్లో పడిపోయాయి.
తాను 32 ఏండ్లుగా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదని రొలాండో ఫెర్నాండేజ్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం సమీప కొండ వద్ద మంటలు చూశానని, కేవలం 15 నిమిషాల్లో మంటలు తమ ప్రాంతం అంతా వ్యాపించడంతో అందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. తాను సంపాదించినదంతా బూడిదైందన్నారు. బాధితులను కాపాడేందుకు వాల్పారాసియో రీజియన్ పరిధిలో మూడు షెల్టర్లు ఏర్పాటు చేశారు. 19 హెలికాప్టర్లు, 450కి పైగా అగ్ని మాపక ఇంజిన్లను తీసుకొచ్చి మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తు్న్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

