ఒమిక్రాన్ విజృంభణ.. 11,500 విమానాలు రద్దు

న్యూయార్క్: ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఇది బిజీ సీజన్. క్రిస్మస్, న్యూయార్క్ వేళ అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు సుమారు 11,500 విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు అధికమయ్యాయి. యూరోప్, అమెరికాలో కోవిడ్ కేసులు మరీ ఎక్కువగా పెరిగాయి. 11,500 విమానాలను రద్దు చేయడమే కాకుండా.. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభణ వల్ల సిబ్బంది హాజరుకావడం లేదని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.
ఫ్లయిట్ ట్రాకర్ ఫ్లయిట్అవేర్ లెక్కల ప్రకారం సోమవారం మూడు వేల విమానాలు రద్దు అయ్యాయి. మంగళవారం కూడా మరో 1100 విమానాలను రద్దు చేశారు. అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో లేబర్ షార్టేజ్ ఏర్పడింది. దీంతో అమెరికా అంటువ్యాధుల విభాగం కొత్త నిర్ణయం తీసుకున్నది. లక్షణాలు లేని కోవిడ్ కేసుల్లో ఐసోలేషన్ వ్యవధిని తగ్గించింది. ఐసోలేషన్ గడువును పది రోజుల నుంచి అయిదు రోజులకు తగ్గించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

