పార్లమెంట్లో కొట్టుకున్న అర్మేనియా ఎంపీలు
అర్మేనియా పార్లమెంట్‌లోని నేషనల్ అసెంబ్లీలో అధికార పార్టీ, విపక్ష పార్టీల ఎంపీలు కొట్టుకోవడం సర్వత్రా ఉత్కంఠ రేపింది.
యెరెవాన్ : అర్మేనియా పార్లమెంట్‌లోని నేషనల్ అసెంబ్లీలో అధికార పార్టీ, విపక్ష పార్టీల ఎంపీలు కొట్టుకోవడం సర్వత్రా ఉత్కంఠ రేపింది. సమావేశాలు జరుగుతున్న సమయంలో అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీకి చెందిన ఎంపీ టారోస్ చఖోయస్ మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ కోచార్యన్ అనుచరులపై అవినీతి ఆరోపణలు చేశారు.
దీంతో ప్రతిపక్ష స్ట్రాంగ్ అర్మేనియా కూటమికి చెందిన ఎంపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు పార్టీల ఎంపీలు స్పీకర్ ముందే కొట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన స్పీకర్ రూబెన్ రుబిన్యన్ ఎంపీల తీరు ప్రజలకు తెలియాలని ఈ గొడవ మొత్తాన్ని లైవ్ ప్రసారం చేయడం కొనసాగించాలని ఆదేశించారు. చివరకు ప్రతిపక్ష పార్టీ నేతదే తప్పు అని స్పీకర్ తేల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

