Antonio Guterres | ఇజ్రాయెల్ వైఖరితో ప్రపంచశాంతికి ముప్పు: ఐక్యరాజ్యసమితి చీఫ్
Antonio Guterres | స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటును ఇజ్రాయెల్ (Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకించడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తప్పుబట్టారు. నెతన్యాహు వైఖరి ప్రపంచ శాంతికి ముప్పు అని వ్యాఖ్యానించారు. నెతన్యాహు తన వైఖరి మార్చుకోకపోతే.. ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్న ఇరు దేశాల వివాదం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందన్నారు. చాలాచోట్ల తీవ్రవాద సంస్థలు పుట్టుకు రావొచ్చని వ్యాఖ్యానించారు.
Antonio Guterres: స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటును ఇజ్రాయెల్ (Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకించడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తప్పుబట్టారు. నెతన్యాహు వైఖరి ప్రపంచ శాంతికి ముప్పు అని వ్యాఖ్యానించారు. నెతన్యాహు తన వైఖరి మార్చుకోకపోతే.. ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్న ఇరు దేశాల వివాదం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందన్నారు. చాలాచోట్ల తీవ్రవాద సంస్థలు పుట్టుకు రావొచ్చని వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో మంగళవారం గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశ ఏర్పాటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని ఎవరు అంగీకరించకపోయినా ఆ నిర్ణయాన్ని తిరస్కరించాల్సిందే. ఎలాంటి స్వతంత్రం, హక్కులు, గౌరవం లేకుండా అంతమంది పాలస్తీనా ప్రజలు ఒక ప్రాంతంలో ఉండటం అసలు ఊహించలేం’ అని గుటెరస్ అన్నారు.
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సేనల ఘర్షణలు ప్రాంతీయంగా అల్లకల్లోలానికి దారితీస్తాయనే అంచనాలు నిజమవుతున్నాయని గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు ఇటీవల లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్, పాకిస్థాన్ దేశాల్లో జరిగిన దాడులను ఆయన ఉదహరించారు. ఇరు పక్షాలు వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.
అయితే, గుటెరస్ కాల్పుల విరమణ పిలుపును ఐరాసలోని ఇజ్రాయెల్ రాయబారి గిలద్ ఎర్డన్ తిరస్కరించారు. 2023 అక్టోబర్ 7న తమపై అత్యంత క్రూరంగా దాడి చేసిన హమాస్‌పై పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గినా హమాస్ మిలిటెంట్లు మరింత రెచ్చిపోయి దాడులకు తెగబడతారన్నారు. ఈ వివాదానికి మూలం ఇరాన్‌లోనే ఉందని, హమాస్, హెజ్బొల్లా, హౌతీలకు ఆ దేశమే ఆయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

