మహమ్మారి పుట్టుకపై ఆంటోని ఫౌసీ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్ : కరోనా వైరస్ సహజంగా అభివృద్ధి చెందిందన్న వాదనతో తాను ఏకీభవించనని మహమ్మారి వ్యాప్తికి దారితీసిన పరిస్థితులకు చైనాలో ఏం జరిగిందనే దానిపై నిగ్గుతేల్చాలనే గొంతుకలకు బాసటగా నిలుస్తానని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌసీ అన్నారు. యునైటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అమెరికా పేరిట ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహమ్మారి వ్యాప్తికి చైనాలో ఏం జరగిందనేది వెల్లడయ్యే వరకూ మన పరిశోధనలు సాగాలని, ఈ వైరస్ సహజంగా అభివృద్ధి చెందిందనే విషయంతో తాను సమ్మతించనని స్పష్టం చేశారు.
జంతువుల నుంచి మానవులకు ఈ వైరస్ సోకిందని పరిశోధకులు చెప్పేందుకు ప్రయత్నించినా దీనికంటే మరేదో మహమ్మారి పుట్టుక, వ్యాప్తి వెనుక ఉండవచ్చని దాన్ని మనం కనుగొనాల్సి ఉందని జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్ పౌసీ అన్నారు. చైనాలో ఏం జరిగిందనేది గుర్తించేందుకు తదుపరి పరిశోధనల పట్ల తాను పూర్తి సానుకూలంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా కొవిడ్-19 తొలిసారి ప్రపంచంపై విరుచుకుపడిన సమయంలో మహమ్మారి పుట్టుక చైనా కేంద్రంగా సాగిందనే వాదనను తోసిపుచ్చిన ఫౌసీ ప్రస్తుతం యూటర్న్ తీసుకోవడం విశేషం. వైరస్ సహజంగా అభివృద్ధి చెంది భిన్న వర్గాలకు వ్యాపించిందని అప్పట్లో ఫౌసీ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Anthony Fausi
- china
- Covid-19
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

