Oil Tanker destroy | హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ ధ్వంసం.. పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తీవ్రం
Oil Tanker destroy | ఇరాన్ (Iran) తో అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) పై శుక్రవారం 'ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)' క్షిపణులతో దాడిచేసి ధ్వంసం చేసింది.
Oil Tanker destroy : ఇరాన్ (Iran) తో అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) పై శుక్రవారం ‘ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)’ క్షిపణులతో దాడిచేసి ధ్వంసం చేసింది. దాడికి గురైన ట్యాంకర్ పాకిస్థాన్ జెండాతో ఉన్నట్లు కథనాలు సూచిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జలసంధిని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ దాడి జరిగినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు పాకిస్థాన్ జెండా మాటున చమురును అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకుని పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో సిబ్బంది ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుంది.
ఇరాన్ తన అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధిలోకి ఏ నౌక ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం స్తంభించిపోగా.. 85కి పైగా ట్యాంకర్లు గల్ఫ్‌లోనే చిక్కుకుపోయాయి. మార్చి 11న కూడా థాయ్‌లాండ్‌కు చెందిన నౌకపై దాడి జరిగింది. ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. తాజా ఘటనతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
Another oil tanker trying to cross the Strait of Hormuz without permission has been destroyed.#IranWar #Iran #Israel pic.twitter.com/izOOWMh2F8
— Iran time (@khanadan99) March 27, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

