Guinness records | గడ్డంతో గిన్నిస్ రికార్డులు సృష్టిస్తున్న అమెరికా వాసి
Guinness records | గడ్డాన్ని అందంగా పెంచడంతో పాటు కొత్తకొత్తగా అలంకరించుకుంటూ గిన్నిస్ రికార్డులు కొట్టేస్తున్నాడు ఓ అమెరికన్. ఇప్పటివరకు 9 రికార్డులు తన పేరిట లిఖించుకోగా.. ఇందులా నాలుగు గడ్డంపై బబుల్స్ అలంకరణవే కావడం విశేషం.
Guinness records | గడ్డం.. ఇప్పుడు యూత్‌లో భళే క్రేజ్. దీనిని దృష్టిలోపెట్టుకుని ‘నో షేవింగ్ మంత్’ ను జరుపుతున్నారంటే.. గడ్డం పెంచుకోవాలన్న కోరిక ఎంత బలిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రికార్డులు సృష్టించడంతో గడ్డం అడ్డం కాదని, అదే గడ్డంతో నాలుగు గిన్నిస్ రికార్డులు కొట్టేశాడో అమెరికా వాసి. ఈయన మొత్తం 9 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం.
అమెరికాలోని ఇడాహోకు చెందిన జోయల్ స్ట్రాసర్ అనే వ్యక్తి తన గడ్డాన్ని అపురూపంగా పెంచుకుంటున్నాడు. నిత్యం ఎంతో అందంగా అలంకరించుకుంటాడు. గడ్డం ఆరోగ్యం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటారు. ఇలా ప్రేమగా పెంచుకోబట్టే.. ఆ గడ్డం ఆయనకు ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తెచ్చిపెట్టింది.
గత మూడేండ్లుగా వరుసగా గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధిస్తున్న జోయల్ స్ట్రాసర్.. తాజాగా 710 బబుల్స్‌తో తన రికార్డును మరోసారి బద్దలు కొట్టాడు. తొలిసారి 2019 లో 302 బబుల్స్‌తో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన స్ట్రాసర్.. మరుసటి ఏడాది 542 బబుల్స్‌తో.. 2021 లో 686 బబుల్స్‌లో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. క్రిస్మస్ వేళ తన గడ్డాన్ని క్రిస్మస్ చెట్టుకు అలంకరించే వస్తువులతో అందంగా తీర్చిదిద్ది నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

