Birth Control Pill | పురుషులకూ గర్భ నిరోధక పిల్.. మహిళలపై తగ్గనున్న భారం!
అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది హార్మోన్లలో మార్పులు చేసే సంప్రదాయ గర్భనిరోధక పద్ధతుల లాగా కాకుండా స్పెర్మ్ (వీర్యం) ఉత్పత్తిపై ప్రభావం చూపి గర్భ నిరోధకతగా పని చేస్తుంది.
- టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట
- కుటుంబ నియంత్రణలో విప్లవాత్మక ఆవిష్కరణ
- కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా పరిశోధకులు
Birth Control Pill | న్యూయార్క్, ఏప్రిల్ 2: అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది హార్మోన్లలో మార్పులు చేసే సంప్రదాయ గర్భనిరోధక పద్ధతుల లాగా కాకుండా స్పెర్మ్ (వీర్యం) ఉత్పత్తిపై ప్రభావం చూపి గర్భ నిరోధకతగా పని చేస్తుంది. వైసీటీ- 529గా పిలుస్తున్న ఈ పిల్‌ను యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కొలంబియా యూనివర్సిటీ, యూవర్ ఛాయిస్ థెరప్యూటిక్స్‌ల సంయుక్తాధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇప్పటికే పురుషులపై మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్టు పరిశోధకులు తెలిపారు. సేఫ్టీ, ప్రభావవంత పనితీరుకు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలో జరిగే అవకాశం ఉంది.
స్పెర్మ్ కౌంట్ తగ్గించి…
పురుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించక ముందు మగ ఎలుకలపై వైసీటీ-529 డ్రగ్‌ను ప్రయోగించగా.. నాలుగు వారాల వ్యవధిలోనే స్పెర్మ్ కౌంట్ భారీగా తగ్గినట్టు, 99 శాతం ప్రభావవంతంగా పని చేసినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఈ పిల్ వాడకాన్ని ఆపేసిన ఆరు వారాల్లోగా ఎలుకలు మళ్లీ ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని పొందినట్టు పరిశోధకులు గుర్తించారు. క్షీరదాల్లో రెండు వారాల్లోగా స్పెర్మ్ కౌంట్ తగ్గిందని, డ్రగ్ వాడకం ఆపిన 10-15 వారాల్లోగా తిరిగి సామర్థ్యాన్ని పొందినట్టు పరిశోధకులు తెలిపారు. దీని వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా లేవని చెప్పారు.
మహిళలపై భారం తగ్గుదల…
ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధకత అంటే మహిళ బాధ్యత అనే అపోహ సమాజంలో ఉన్నది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా అవాంఛనీయ గర్భధారణ రేటు సుమారు 50 శాతం వరకు ఉన్నది. అమెరికాలోని ఎఫ్‌డీఏ 20కి పైగా గర్భ నిరోధక డ్రగ్స్‌కు ఆమోదం తెలిపినప్పటికీ, పురుషులకు మాత్రం కండోమ్, వ్యాసెక్టమీ తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో వైసీటీ-529కు ఆమోదం లభిస్తే కొంతమేర అవాంఛనీయ గర్భధారణను అరికట్టే అవకాశం ఉంది. అంతేకాదు, దీని వల్ల మహిళలపై భారం తగ్గే ఆస్కారం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

