Cancer | న్యూయార్క్, మే 14: కండ్లకు ఉపయోగించే కాంటాక్ట్ లెన్స్‌లను ప్రమాదకర, క్యాన్సర్ కారక ‘ఫరెవర్ కెమికల్స్’తో తయారు చేస్తున్నట్టు అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో లభించే 18 రకాల ప్రముఖ కాంటాక్ట్ లెన్స్‌ను పరీక్షించగా వీటిల్లో పెర్ ఆండ్ పాలిఫ్లోరోఅల్కైల్ సబ్స్టెన్స్ (పీఎఫ్ఏఎస్) మార్కర్ అయిన ఆర్గానిక్ ఫ్లోరిన్ అధిక స్థాయిలో ఉన్నదని గుర్తించారు.
సాధారణంగా ఈ పీఎఫ్ఏఎస్లను ఏవైనా వస్తువులను నీరు, వేడిని తట్టుకునేలా మార్చేందుకు వినియోగిస్తుంటారు. ఇవి అంత త్వరగా విచ్ఛిన్నం కావు. అందుకే వీటిని ‘ఫరెవర్ కెమికల్స్’గా పిలుస్తుంటారు. క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, కాలేయ వ్యాధి వంటి వాటికి పీఎఫ్ఏఎస్ కారణం కావచ్చు.
ఇటీవల అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ చేసిన అధ్యయనం ప్రకారం.. పీఎఫ్‌ఏఎస్‌లు శరీరంలోకి వెళ్లడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ పెరుగుతుందని, కిడ్నీ, వృషణ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని తేలింది. కాగా, టాయ్‌లెట్ పేపర్లలో కూడా ఈ ప్రమాదకర ‘ఫరెవర్ కెమికల్స్’ అన్నాయని పరిశోధకులు గుర్తించారు.