Airlines Fire | త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్‌కు వెళ్తుండగా విమానంలో చెలరేగిన మంటలు..!
Airlines Fire | అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
Airlines Fire | అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్‌పై పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం టేకాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్స్టాఫ్ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ప్రయాణికులు భయంతో అత్యవసర స్లయిడ్పైకి జారుతూ విమానం నుంచి బయటకు రావడం కనిపించింది.
ఈ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు, పొగలు రావడం కనిపించింది. పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్‌పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్ విమానాశ్రయం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్‌లో టెర్మినల్‌కు తరలించారు. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. సిబ్బంది వేగంగా స్పందించినందుకు ప్రశంసించింది. ఎఫ్ఏఏ సైతం మొత్తం ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.
🚨#BREAKING: Watch as People evacuate from a American Airlines jet after a left main wheels caught fire
Watch as passengers and crew evacuate American Airlines Flight 3023, a Boeing 737 MAX 8, at Denver International Airport. The Miami-bound jet was forced… pic.twitter.com/RmUrXYj5Jp
— R A W S A L E R T S (@rawsalerts) July 26, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

