న్యూయార్క్: దాదాపు 50 ఏండ్ల తర్వాత చంద్రుడిపైకి అమెరికా చేపట్టిన మూన్ మిషన్ విఫలమైనట్టు కనిపిస్తున్నది. ప్రయోగం జరిపిన 24 గంటల్లోనే ‘పెరిగ్రిన్ స్పేస్‌క్రాఫ్ట్’లో ఇంధన లీకేజ్ సమస్య తలెత్తినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఇంధన ట్యాంక్‌లో తీవ్ర సమస్య తలెత్తిందని, రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండర్‌ను తయారుచేసిన ప్రైవేట్ కంపెనీ ‘ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్’ మంగళవారం ప్రకటించింది. చంద్రుడిపై ‘పెరిగ్రిన్’ సాఫ్ట్‌ల్యాండ్ జరిపే అవకాశం లేదని, స్పేస్‌క్రాఫ్ట్‌పై గ్రౌండ్‌స్టేషన్ నియంత్రణ కోల్పోయిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మిషన్‌కు సంబంధించి మరికొద్ది గంట ల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.