Bill Clinton | అమెరికా మాజీ అధ్యక్షుడికి అస్వస్థత.. దవాఖానలో చేరిన బిల్ క్లిటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్‌లోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 78 ఏండ్ల క్లింటన్ తీవ్ర జ్వరంతో బాధతుండటంతో హాస్పిటల్లో చేర్పించినట్లు అయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్‌లోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 78 ఏండ్ల క్లింటన్ తీవ్ర జ్వరంతో బాధతుండటంతో హాస్పిటల్లో చేర్పించినట్లు అయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. క్రిస్మస్ నాటికి తిరిగి ఇంటికి చేరుకుంటానని బిల్ క్లింటన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు సేవలందించారు. 1993-2001 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడం వల్ల ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ అయింది. 2005లో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో దవాఖానలో చేరారు. 2021లో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు ఆరు రోజుల పాటు కాలిఫోర్నియాలోని హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. 2022లో కరోనా బారినపడిన ఆయన కొన్నిరోజులకు కోలుకున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ల తరఫున ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

