వాషింగ్టన్, జనవరి 12: కొత్త ఏడాదిలోనూ టెక్ రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ యాజమాన్యంలోని ఆన్లైన్ ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ సర్వీస్ ‘అడిబుల్’ సిద్ధమైంది. ఈ మేరకు పలువురు ఉద్యోగస్తులకు గురువారం సందేశాలు అందాయి. గత వారం వ్యవధిలో అమెజాన్‌లో మూడో విడత ఉద్యోగాల కోత జరుగడం గమనార్హం. కంపెనీ సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఉద్యోగులకు పంపిన మెమోలో ఆడిబుల్ సీఈవో బాబ్ కారిగాన్ పేర్కొన్నారు.
తాజా కోత ప్రభావం ఎంత మందిపై పడుతుందనే దానిపై స్పందించేందుకు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు నిరాకరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియోస్ యూనిట్లో ఇప్పటికే ఉద్యోగాల కోతను ప్రకటించారు. దీని ద్వారా వందలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. అంతముందు ఖర్చు తగ్గించుకొనేందుకు, ఆదాయం పెంచుకొనేందుకు 500 మందిని పైగా తొలగిస్తున్నట్టు అమెజాన్‌కు చెందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ట్విట్చ్ పేర్కొన్నది.