Rishi Sunak | యూకేలో విద్యార్థులు 18 ఏళ్ల వరకు గణితం తప్పనిసరిగా చదవాల్సిందే
యూకే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు వైద్య సేవల్లో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మెకు దిగడం వంటి సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్‌ను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ మొదటి ప్రసంగంకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి. ఈ ప్రసంగంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూకేలో విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చే వరకు గణిత బోధన తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది.
Rishi Sunak | యూకే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు వైద్య సేవల్లో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మెకు దిగడం వంటి సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్‌ను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ మొదటి ప్రసంగంకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి. ఈ ప్రసంగంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూకేలో విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చే వరకు గణిత బోధన తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది.
జీవితంలో తాను పొందిన ప్రతీ అవకాశం విద్య వల్లనే లభించిందని.. అందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు తన ప్రసంగంలో చెప్పారు. ప్రతి చిన్నారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. సరైన ప్రణాళికతో దీనిని అందించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలతో మనం పోటీ పడలేకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదని అన్నారు.
ప్రస్తుతం 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సగం మంది యువత గణితాన్ని పాఠ్యాంశంగా ఎంచుకోవడం లేదన్నారు. మన పిల్లలకు ఇంతకుముందుతో పోలిస్తే.. భవిష్యత్తులో ఉద్యోగాలకు అనలిటికల్ నైపుణ్యాల అవసరం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ నైపుణ్యాలు లేకుండా వారిని బయటకు పంపించడం వారిని నిరాశకు గురి చేస్తుందని.. అందుకే 18 ఏళ్ల వయసు వరకు గణితం తప్పనిసరి అని తన ప్రసంగంలో రిషి సునాక్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

