కిడ్నీ సమస్యలతో పిల్లల మృతి.. సిరప్‌లను నిషేధించిన ఇండోనేషియా
syrups ban | ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు నిర్ణయం
జకార్తా : ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా సిరప్లు తీసుకున్న తర్వాత పిల్లల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలున్నాయి. ఈ క్రమంలో పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్ సప్లిమెంట్స్‌ను విక్రయాలను ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు.
గత జనవరి నుంచి దేశంలో పిల్లల మరణాల సంఖ్య పెరిగింది. దేశంలోని 20 ప్రావిన్సుల్లో 99 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహ్మద్ సయారిల్ మన్సూర్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను సిఫారసు చేయొద్దని వైద్యులకు ఆదేశాలచ్చినట్లు మన్సూర్ పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సిరప్ విక్రయాలు చేపట్టొద్దని మెడికల్ స్టోర్స్‌ను మంత్రిత్వశాఖ ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు సిరప్ కారణంగా 70 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండోనేషియాలో పిల్లల మరణాలు వెలుగులోకి వచ్చింది. భారత్‌లో సిరప్ తయారు కాగా.. దగ్గు మందుతో దేశంలో కూడా మరణాలు చోటు చేసుకున్నాయా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

