అల్‌ఖైదా చీఫ్ జవహరీ బతికే ఉన్నాడు!

వీడియోను విడుదల చేసిన ఉగ్రవాద సంస్థ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఎప్పుడో చనిపోయాడనుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిగి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అల్‌ఖైదా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో జవహరీ కనిపించాడు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించిన అతడు పలు అంశాలపై మాట్లాడాడు. 20 ఏండ్ల యుద్ధం తర్వాత అమెరికా చెల్లాచెదురై అఫ్గానిస్థాన్ నుంచి నిష్క్రమిస్తుందని అతడు పేర్కొన్నాడు. తాలిబన్లు అఫ్గాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడాన్ని ప్రస్తావించలేదు. సిరియాలోని రష్యా సైనిక స్థావరంపై అల్‌ఖైదా అనుబంధ సంస్థ జరిపిన దాడిని ప్రస్తావించాడు. ఈ దాడి ఈ ఏడాది జనవరిలో జరిగింది. దీనిబట్టి ఈ వీడియో ఇప్పుడు రికార్డు చేసిందికాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు గంట నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

