కణాల్లో ‘వయసు’ రహస్యాలు!
‘ఏంట్రా వయసు పెరిగేకొద్దీ యంగ్‌గా మారుతున్నావు’... ‘ఏరా నిండా పాతికేళ్లు కూడా ఉండవు నీకు.. నాకంటే ముందే ముసలోడివి అయ్యేటట్టు ఉన్నావే’ ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడో ఒకచోట వింటునే ఉంటాం. కొందరు రోజులు గడిచేకొద్దీ యవ్వనంగా మారుతుంటారు.
- హోమియోస్టాసిస్ తగ్గితే వృద్ధాప్యం
న్యూయార్క్ : ‘ఏంట్రా వయసు పెరిగేకొద్దీ యంగ్‌గా మారుతున్నావు’… ‘ఏరా నిండా పాతికేళ్లు కూడా ఉండవు నీకు.. నాకంటే ముందే ముసలోడివి అయ్యేటట్టు ఉన్నావే’ ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడో ఒకచోట వింటునే ఉంటాం. కొందరు రోజులు గడిచేకొద్దీ యవ్వనంగా మారుతుంటారు. మరికొందరు చిన్న వయసులోనే నడివయస్కులుగా కనిపిస్తుంటారు. కణాల పనితీరే దీనికి కారణమై ఉండొచ్చని సైంటిస్టులు తాజాగా వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్కు చెందిన శాస్త్రవేత్త ఎల్లెన్ క్వార్లెస్ దీనిపై పరిశోధనలు చేశారు. వృద్ధాప్యానికి ఒకటే కారణం ఉండదని గుర్తించారు. ఏ ఇద్దరు వ్యక్తుల వయసుల పరిణామ క్రమం ఒకేలా ఉండదని తేల్చారు.
శరీరం సామర్థ్యాన్ని కోల్పోతే…
వృద్ధాప్యం అనేది సమయం ఆధారిత ప్రక్రియ అని ఎల్లెన్ క్వార్లెస్ తెలిపారు. ఆయన పరిశోధనల ప్రకారం… మానవుడిలో ఉండే కోట్ల కణాలు ఒకదానికొకటి సమాచారాన్ని పంచుకుంటూనే సజీవంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. మానవ శరీరానికి వచ్చే సమస్యలను నివారించేందుకు, గుర్తించి పరిష్కరించేందుకు అవి చాలా శక్తిని ఖర్చు చేస్తాయి. ఈ క్రమంలో హోమియోస్టాసిస్ను నిర్వహించే సామర్థ్యాన్ని శరీరం క్రమంగా కోల్పోతుందని, దీన్నే వృద్ధాప్యంగా పేర్కొంటారని పరిశోధకులు తెలిపారు. శరీరంలోని వ్యవస్థల మధ్య సమతుల్య స్థితిని కొనసాగించడాన్ని హోమియోస్టాసిస్ అని అంటారు. శరీరంలోని వ్యవస్థల మధ్య సమతుల్య స్థితి దెబ్బతినడం, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించకపోవడం వల్ల శరీరం హోమియోస్టాసిస్ను నిర్వహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో వృద్ధాప్యం సంభవిస్తుందని పరిశోధనలో తేలింది.
క్యాలరీల పరిమాణాన్ని తగ్గిస్తూ…
ఈగలు, ఎలుకలు, ఏలికపాములు తదితర జీవులపై చేస్తున్న ప్రయోగాల్లో వయసు నెమ్మదిగా పెరిగేలా చేయడంలో కొంత పురోగతి సాధించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా జంతువులు పోషకాలను కోల్పోకుండానే అవి సాధారణంగా తినే క్యాలరీల పరిమాణాన్ని తగ్గించి, పరిమితులను విధిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో వినియోగించే ఔషధం రాపమైసిన్ కూడా ఇదే సూత్రం ప్రకారం పని చేస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

