Afghanistan | మహిళలకు వర్సిటీ విద్యపై నిషేధం.. తరగతులు బహిష్కరించిన పురుష విద్యార్థులు
Afghanistan | అఫ్గానిస్థాన్లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్యను నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.
కాబూల్: అఫ్గానిస్థాన్లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్యను నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అమ్మాయిలను వర్సిటీల్లోకి అనుమతించే వరకు క్లాసులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. మహిళలకు ఉన్నత విద్యను దూరంచేసేలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలను తరగతులకు వచ్చేవారకు తమ ఈ నిరసన కొనసాగుతుందని ముజాముల్ అనే విద్యార్థి స్పష్టం చేశాడు. అప్పటివరకు తాము చదువుకునేది లేదని చెప్పాడు. తమ సోదరీమణులకు యూనివర్సిటీ విద్యను బంద్ చేశారు. అలాగైతే తాము కూడా వర్సిటీలకు వెళ్లేది లేదని తెలిపాడు.
అమ్మాలకు వర్సిటీ విద్యపై తాలిబన్ ప్రభుత్వం గతవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. మహిళలకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం అక్కర్లేదని విద్యాశాఖ మంత్రి నిదా మహ్మద్ నదిం అన్నారు. యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన పేర్కొన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- ban
- students
- Taliban
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

