న్యూయార్క్: ధనవంతులు అత్యంత రహస్యంగా, విలాసవంతంగా ప్రయాణించేందుకు ఓ ఓడ సిద్ధమవుతున్నది. పెగాసస్ అని పిలిచే ఈ ఓడ పూర్తిగా అద్దాలతో పారదర్శకంగా ఉండేలా రూపుదిద్దుకోనున్నది. 290 అడుగుల ఎత్తులో ఆకాశం, సముద్రం ప్రతిబింబించేలా ఈ ఓడ డిజైన్‌ను అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జోజెఫ్ ఫోకిస్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే తొలి 3డీ ఓడ. అద్దాలలో అమర్చిన సోలార్ వింగ్స్‌తో ఓడ నడిచేందుకు కావాల్సిన సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొంటుంది. ఇందులో ప్రయాణిస్తున్నప్పుడు మన తలమీదనుంచి మేఘాలు వెళ్లిపోతున్న అనుభూతి కలుగుతుంది. 2030 వరకు వీటి ఉత్పత్తి ప్రారంభం కావొచ్చని జోజెఫ్ ఫోకిస్ తెలిపారు.