అరుదైన నల్ల మూపు నెమలిపావురం చిక్కింది!
ఏండ్ల కిందట కనిపించకుండా పోయిన నల్లమూపు నెమలి పావురాన్ని పరిశోధకులు తిరిగి కనుగొన్నారు. ఈ అరుదైన పక్షి వీడియో ఫుటేజీని పపువా న్యూగినియాలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు.
పోర్ట్ మోర్సీ, నవంబర్ 18: 140 ఏండ్ల కిందట కనిపించకుండా పోయిన నల్లమూపు నెమలి పావురాన్ని పరిశోధకులు తిరిగి కనుగొన్నారు. ఈ అరుదైన పక్షి వీడియో ఫుటేజీని పపువా న్యూగినియాలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ నెమలి పావురాన్ని చిత్రీకరించేందుకు పరిశోధకులు నెలలపాటు శ్రమించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.
అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. చివరికి సెప్టెంబర్‌లో ఇది కెమెరాకు చిక్కింది. ఈ పక్షి పపువా న్యూగినియాలోని ఫెర్గూసన్ ద్వీపానికి చెందినది. బర్డ్‌లైఫ్ ఇంటర్నేషనల్, రివైల్డ్, అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీ సహకారంతో పరిశోధనా బృందం కనుమరుగైన పక్షుల జాతులను గుర్తిస్తున్నాయి. ఈ బృందం 2019లోనే నల్లమూపు నెమలిపావురాన్ని కనుగొనేందుకు ప్రయత్నించింది. కానీ, విఫలమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

