Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్
Rishi Sunak | యునైటెడ్ కింగ్డమ్ ప్రధానిగా రిషి సునాక్ మంగళవారం ప్రమాణం చేశారు. చార్లెస్-3 ఆహ్వానం మేరకు క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు.
Rishi Sunak | ఒకనాటి రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్‌లో కొత్త శకం ఆరంభమైంది. దాదాపు 200 ఏండ్ల పాటు భారత్‌లో వలస పాలన సాగించిన బ్రిటన్‌లో భారత సంతతి నేత రిషి సునాక్.. ఆ దేశ ప్రధానిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం బకింగ్హమ్ ప్యాలెస్‌కు వెళ్లి కింగ్ చార్లెస్-3తో సమావేశమయ్యారు. చార్లెస్-3 ఆహ్వానం మేరకు క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు.
అంతకుముందు ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్.. తన అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో చివరి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అటుపై తన రాజీనామా లేఖను రాజు చార్లెస్-3కి సమర్పించారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ప్రమాణం చేసేందుకు మార్గం సుగమమైంది. చివరి క్యాబినెట్ భేటీ తర్వాత లిజ్ ట్రస్ మాట్లాడుతూ రిషి సునాక్ పాలన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మంచి రోజులు ముందు ఉన్నాయన్నారు. దేశ ప్రధాని అయ్యే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
గతంలో కన్జర్వేటివ్ పార్టీ నేత బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో మంత్రులుగా రిషి సునాక్, లిజ్ ట్రస్లు పని చేశారు. కరోనా వేళ బోరిస్ జాన్సన్ అనుసరించిన వైఖరి, స్కామ్‌ల్లో చిక్కుకుపోతుండటంతో రిషి సునాక్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చేయడంతో బోరిస్ జాన్సన్ ప్రధానిగా వైదొలగక తప్పలేదు. దరిమిలా జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్‌తోపాటు లిజ్ ట్రస్ పోటీ పడ్డారు. కానీ, మెజారిటీ టోరీ పార్టీ సభ్యులు లిజ్ ట్రస్‌కే ఓటేశారు. కానీ, ఇచ్చిన హామీ మేరకు సంపన్నులపై పన్నుల్లో కోత విధించడంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నది.
ఎకానమీని గాడిలో పెట్టలేక సతమతమైన లిజ్ ట్రస్.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. అధికార కన్జర్వేటివ్ పార్టీ అంతే వేగంగా నూతన ప్రధాని ఎంపిక చేపట్టింది. రిషి సునాక్‌తోపాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ పోటీ పడ్డారు. కానీ.. పార్టీ ఐక్యత కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం అర్థరాత్రి పొద్దుపోయిన తర్వాత బోరిస్ జాన్సన్ ప్రకటించడంతోనే రిషి సునాక్ ఎన్నిక దాదాపు ఖాయమైంది. పెన్నీ మోర్డాంట్ చివరి వరకు పోటీ పడినా.. అవసరమైన వంద మంది ఎంపీల మద్దతు కూడగట్టలేక వైదొలిగారు. ఫలితంగా రిషి సునాక్ ఏకగ్రీవంగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

