టోక్యో: జపాన్‌లోని టోక్యో విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు ఒకే రన్‌వే పైకి వచ్చిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలవలేదని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం టోక్యోలోని హనెడా విమానాశ్రయంలోని ఒకే రన్‌వేపైకి బ్యాంకాక్ వెళ్లే థాయ్ ఎయిర్వేస్ విమానం, ఈవీఏ ఎయిర్‌కు చెందిన మరో ప్రయాణికుల విమానం వచ్చాయి.
అయితే పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే రెండు విమానాలు స్పల్పంగా ఢీకొనడంతో థాయ్ ఎయిర్వేస్ విమానం రెక్క విరిగింది. అధికారులు ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనతో పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.