ఆయుష్షు పెంచే ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం
మనుషుల జీవితకాలాన్ని పెంచాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఓ ఔషధం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
- వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తున్నట్టు గుర్తించిన సైంటిస్టులు
లండన్, జూలై 18: మనుషుల జీవితకాలాన్ని పెంచాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఓ ఔషధం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఎలుకలపై విజయవంతమైన ఈ ఔషధ ప్రయోగం మనుషుల ఆయుష్షును కూడా పెంచవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఎంఆర్సీ ల్యాబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్, సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు తయారుచేసిన ఈ ఔషధానికి సంబంధించిన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం
పరిశోధకులు ఈ ప్రయోగంలో భాగంగా ఇంటర్‌ల్యూకిన్-11 అనే ప్రొటీన్‌పై దృష్టి సారించారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో దీని స్థాయిలు పెరుగుతాయి. వృద్ధాప్యానికి ఇదే ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. ఇంటర్‌ల్యూకిన్-11 ఉత్పత్తిని అడ్డుకునేందుకు ఒక ఔషధాన్ని అభివృద్ధి చేశారు. దీనికి 75 వారాల వయసు ఉన్న ఎలుకలపై ప్రయోగించారు. ఇది మనుషులకు 55 ఏండ్ల వయసుతో దాదాపుగా సమానం. ఈ ఔషధాన్ని ప్రయోగించిన ఎలుకల జీవితకాలం 20-25 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు.
ఎలుకల కండరాల పనితీరు మెరుగయ్యిందని, సన్నగా, చురుగ్గా మారాయని, వెంట్రుకలు ఎక్కువగా వచ్చాయని గుర్తించినట్టు చెప్పారు. ఎలుకలపై సత్ఫలితాలను ఇచ్చిన ఈ ఔషధాన్ని ప్రస్తుతం మనుషులపై కూడా ప్రయోగిస్తున్నారు. ముందుగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న వారికి ఈ ఔషధం ఇచ్చామని, ఇది మనుషులు తీసుకోవడానికి సురక్షితమే అనేది తాము గుర్తించినట్టు ప్రొఫెసర్ స్టువర్ట్ కుక్ తెలిపారు. అయితే, మనుషులపై ఇది ఎలా పని చేస్తుందనే తేలాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

