మీరు ఓ వేలితో ఎంత బరువెత్తుతారు? ఓ ఐదు కిలోలు అతి కష్టం మీద ఎత్తొచ్చు. ప్రాక్టీస్ చేస్తే మరిన్ని కిలోలు ఎత్తగలం. కానీ, ఓ వ్యక్తి తన మధ్య వేలితో ఏకంగా 129 కిలోల బరువెత్తి ఆశ్చర్యపరిచాడు. ఈ భారీ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. లండన్‌కు చెందిన స్టీవ్ కీలర్ అనే మార్షల్ ఆర్టిస్ట్ తన మధ్య వేలిని ఉపయోగించి 285.49 పౌండ్లు లేదా 129.49 కిలోల డెడ్‌లిఫ్ట్‌ను ఒక వేలితో ఎత్తి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
తాను 18 ఏళ్ల వయస్సునుంచే కరాటే ప్రాక్టీస్ చేస్తున్నానని, నాలుగేళ్ల నుంచి డెడ్‌లిఫ్ట్ ఎత్తే శిక్షణ తీసుకుంటున్నట్లు కీలర్ చెప్పాడు. అతని శిక్షణా సెషన్లలో ఎత్తిన బరువు ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఎత్తిన దానికంటే 10 కిలోల బరువు మాత్రమే ఉందని తెలుసుకుని గిన్నిస్‌పై కన్నేశాడు. అనుకున్నట్లే కీలర్ 129 కిలోల బరువెత్తి 2012లో 121.69 కిలోలతో ఆర్మేనియన్ బెనిక్ ఇస్రాయెల్యాన్ సాధించిన రికార్డును బద్దలుకొట్టాడు. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితమిస్తున్నట్లు కీలర్ తెలిపాడు.