అమెరికాలో మంచు తుఫాను
అమెరికాను మంచు తుఫాను వణికిస్తున్నది. కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాలు తుఫాను గుప్పిట్లో చిక్కుకున్నాయి.
- 1,550కిపైగా విమానాల రద్దు
- 2.8 లక్షల ఇండ్లకు నిలిచిన విద్యుత్తు
- పలుచోట్ల రహదారుల మూసివేత
కాలిఫోర్నియా: అమెరికాను మంచు తుఫాను వణికిస్తున్నది. కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాలు తుఫాను గుప్పిట్లో చిక్కుకున్నాయి. లక్షలాది ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వేలాది విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు చోట్ల రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు మంచు తుఫాను ప్రభావం కన్పించింది.
సాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్‌తో వెచ్చగా ఉండే లాస్ఏంజిల్స్లోని పలు ప్రాంతాలకు సైతం హిమపాత హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం వరకు అప్రమత్తంగా ఉండాలని లాస్ఏంజిల్స్ పర్వత శ్రేణులు, వెంచురా, సాంతాబార్బర, మిన్నెసోటా ప్రాంతవాసులకు అధికారులు సూచించారు. మంచు తుఫాను కారణంగా 1,550కి పైగా విమానాలను రద్దు చేశారు. 2.8 లక్షల ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రహదారులను మూసివేశారు. తప్పనిసరి ప్రయాణం చేయాలనుకునేవారు వింటర్ సర్వైవల్ కిట్‌ను ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Blizzard
- California
- Snow
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

