న్యూయార్క్: అంతరిక్షంలో భూమివైపునకు భారీ కాంతిని వెదజల్లుతున్న ఓ బ్లాక్‌హోల్ గుట్టును పరిశోధకులు విప్పారు. భూగ్రహంపైకి 10 కోట్ల కోట్ల సూర్యుళ్లు వెదజల్లేంత కాంతిని పంపిస్తున్న కృష్ణబిలాన్ని గుర్తించారు.
కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియంట్ ఫెసిలిటీ సాయంతో దీన్ని కనుగొన్నారు. ఈ కృష్ణబిలానికి ‘ఏటీ 2022 సీఎంసీ’గా నామకరణం చేశారు. ఇది భూమి నుంచి 850 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. 21 టెలిస్కోప్‌లను ఉపయోగించి బ్లాక్‌హోల్ నుంచి అలల అంతరాయ సంఘటన (టైడల్ డిస్రప్సన్ ఈవెంట్) అనే దృగ్విషయం వల్ల భారీ కాంతి వెదజల్లుతున్నట్టు తేల్చారు.