150 ఏండ్ల నాటి వివాహ ధృవీకరణ పత్రం.. ఎవరిదంటే?

వాషింగ్టన్: 150 ఏండ్ల నాటి వివాహ ధృవీకరణ పత్రం ఇటీవల వెలుగుచూసింది. ఒక పెయింటింగ్ ఫ్రేమ్ లోపల రహస్యంగా ఉంచిన దీనిని ఒక షాపులోని ఉద్యోగి గుర్తించాడు. దీంతో వందల ఏండ్ల నాటి ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికా నార్త్ కరోలినాలోని బొలీవియాలో ఒక హోస్ట్ చెస్ట్ స్టోర్ ఉద్యోగి పురాతన పెయింటింగ్‌ను శుభ్రం చేస్తుండగా ఫ్రేమ్ వెనుక వైపు లోపల ఒక కవర్ ఉన్నట్లు గమనించాడు. 1889లో ముద్రించిన ఆ ఫొటోలో పూలను చేతపట్టిన బాలిక, ఆమె వెనుక కుక్క బొమ్మ ఉన్నది. ఆ ఫొటో ఫ్రేమ్ వెనుక రహస్యంగా ఉంచిన కవర్‌ను బయటకు తీయగా 150 ఏండ్ల నాటి వివాహ ధృవీకరణ పత్రం బయటపడింది.
ఈ మ్యారేజ్ సర్టిఫికెట్, న్యూజెర్సీలోని బోర్డౌన్ నగరానికి చెందిన విలియం, కేటీ జంటకు చెందినగా గుర్తించారు. 1975 ఏప్రిల్ 11న వారిద్దరు పెండ్లి ప్రమాణం చేసినట్లుగా ఈ వివాహ ధృవీకరణ పత్రంలో ఉన్నది. దీనిని చూసి ఆ షాపును నిర్వహించే ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్మెన్ స్మిత్ ఎంతో ఉత్కంఠకు లోనయ్యారు. ఈ పురాతన మ్యారేజ్ సర్టిఫికెట్‌ను నిజమైన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. దీని గురించి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ జంటకు చెందిన కుటుంబానికి దీనిని అప్పగిస్తానని తెలిపారు.
అయితే, వివాహ ధృవీకరణ పత్రంలో చివరి పేరు సరిగా కనిపించకపోవడంతో వారి పూర్తి పేరు గుర్తించడం కష్టంగా ఉన్నదని స్మిత్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ జంట కుటుంబాన్ని గుర్తించేందుకు తన పోస్ట్‌ను చాలా మందికి షేర్ చేసి తనకు సహాయం చేయాలంటూ ఫేస్బుక్ ద్వారా అభ్యర్థించా రు. సంబంధిత కుటుంబీకులను గుర్తించి 150 ఏండ్ల నాటి మ్యారేజ్ సర్టిఫికెట్‌ను వారికి అందజేయగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

