జపాన్‌కు చెందిన 83 ఏండ్ల కెనిచ్చి హోరీ అరుదైన ఘనత సాధించాడు. పసిఫిక్ మహాసముద్రం మీదుగా బోటులో ఒంటరిగా, ఎక్కడా ఆగకుండా విజయవంతంగా ప్రయాణించిన ఈ జపనీస్ సాహసికుడు శనివారం ఇంటికి చేరాడు. ఈ ఘనత సాధించిన అత్యంత వృద్ధుడిగా పేరు సాధించాడు.
రెండు నెలలకు పైగా ఆయన సముద్రంలోనే గడిపాడు. మార్చి ఆఖరులో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న యాచ్ హార్బర్ నుంచి బయలుదేరిన కెనిచ్చి హోరీ.. 69 రోజుల తర్వాత జపాన్ పశ్చిమ తీరంలోని కీస్ట్రెయిట్ చేరారు.