ఆఫ్ఘన్ రక్షణశాఖ మంత్రి ఇంటి వద్ద పేలుడు.. 8 మంది మృతి
Car bomb : ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖ మంత్రి జనరల్ బిస్మల్లాహ్ మహ్మది ఇంటి వద్ద గత అర్ధరాత్రి కారు బాంబు దాడి జరిగింది.

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖ మంత్రి జనరల్ బిస్మల్లాహ్ మహ్మది ఇంటి వద్ద గత అర్ధరాత్రి కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారని, 20 మందికి గాయాలయ్యాయని ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కాబూల్‌లోని షిర్పూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో 10 మంది ప్రభుత్వ ఉన్నతాధికారుల గృహసముదాయాలున్నాయి.
మహ్మది ఇంటి సమీపంలో కారు బాంబు పేలిన వెంటనే నలుగురు ముష్కరులు ఇంటి సమీపంలోకి వచ్చి భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. పేలుడు దాడికి షిర్పూర్ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. రక్షణశాఖ మంత్రి మహ్మది గెస్టుహౌజ్ లక్ష్యంగా చేసుకొని కారు బాంబు దాడి జరిగినట్లు తెలుస్తున్నది. పేలుడు సమయంలో మహ్మది ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. కొన్నివారాల క్రితమే ఆఫ్ఘనిస్థాన్ తమ భూభాగం నుంచి విదేశీ సేనలను వెనక్కు పంపినా తాలిబన్లు మాత్రం దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆఫ్ఘన్ సైనికులతోపాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

