B-52 Bomber Crash: అమెరికాలో కూలిన బీ-52 బాంబర్ విమానం.. 8 మంది సిబ్బంది మృతి
B-52 Bomber Crash: అమెరికాలో బీ-52 బాంబర్ విమానం కూలింది. ఈ ఘటనలో 8 మంది సిబ్బంది మృతిచెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని మోజావే ఎడారిలో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఆ బాంబర్ విమానం నేలరాలింది.
లాస్ ఏంజిల్స్: అమెరికాలో బీ-52 బాంబర్ విమానం(B-52 Bomber Crash) కూలింది. ఈ ఘటనలో 8 మంది సిబ్బంది మృతిచెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని మోజావే ఎడారిలో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఆ బాంబర్ విమానం నేలరాలింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో రొటీన్‌గా పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. లాస్ ఏంజిల్స్ నగరానికి ఉత్తరం దిక్కున ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉన్నది.
బీ-52 బాంబర్ కూలిన తర్వాత ఆ ప్రాంతం నుంచి దట్టమైన నల్లటి పొగ కమ్ముకున్నది. బీ52 విమానానికి చెందిన ఎటువంటి ఆధారాలు కూడా లేకుండా కాలిపోయాయి. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, మిలిటరీ సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. ఫూటేజ్ పరిశీలించిన తర్వాత ఏ ఒక్కరు కూడా బ్రతికి ఉన్నట్లు తెలియడం లేదని కల్నల్ జేమ్స్ హేస్ తెలిపారు. 8 మంది గొప్ప అమెరికన్లు మృతిచెందారని, వారి కుటుంబాలకు ఈ విషయాన్ని చేరవేస్తున్నట్లు హేస్ చెప్పారు. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు పూర్తి కావడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది. రేడార్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్‌లో ఆ బీ-52 బాంబర్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
బోయింగ్ బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ లాంగ్ రేంజ్ బాంబర్.. 1955లో సర్వీస్‌లోకి వచ్చింది. సంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకెళ్లే రీతిలో దీన్ని డిజైన్ చేశారు. ఈ బాంబర్ విమానాన్ని వియత్నాం నుంచి తాజా ఇరానీ యుద్ధం వరకు అమెరికా వాడింది. లాస్ ఏంజిల్స్‌కు 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్‌లో ఎక్కువ శాతం విమానాల టెస్టింగ్ నిర్వహిస్తుంటారు. ఎయిర్ ఫోర్స్ విమానాలు, వెపన్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తుంటారు. 412 టెస్ట్ వింగ్ ఇక్కడ పనిచేస్తుంది. టేకాఫ్ తీసుకున్న తర్వాత ఎక్కువ ఎత్తుకు కానీ ఎక్కువ దూరానికి కానీ వెళ్ల లేదని, అంటే ఫ్లయిట్ కంట్రోల్లో సమస్య వచ్చి ఉంటుందని నిపుణుడు జెఫ్ గుజెట్టి తెలిపారు.
BREAKING: A U.S. Air Force B-52 bomber crashed shortly after takeoff at Edwards Air Force Base, triggering an emergency response.
Emergency crews rushed to the scene as thick black smoke billowed from the wreckage scattered across the desert airfield.
More details, including… pic.twitter.com/JRx3R4ElJW
— Fox News (@FoxNews) June 15, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

