రష్యాలో కరోనా.. నవంబర్‌లో 71 వేల మంది మృతి
Covid deaths | రష్యాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దేశవ్యాప్తంగా గత నెలలో 71 వేలకుపైగా మంది కరోనాకు బలయ్యారు. వైరస్ వల్ల నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 71,187 మంది

మాస్కో: రష్యాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దేశవ్యాప్తంగా గత నెలలో 71 వేలకుపైగా మంది కరోనాకు బలయ్యారు. వైరస్ వల్ల నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 71,187 మంది బాధితులు మృతిచెందారని రష్యన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ రోస్స్టాట్ వెల్లడించింది. అయితే గత నెలలో మొత్తం 87,527 మంది చనిపోయారని, వారిలో కొందరివి కరోనా మరణాలు కాదని తేల్చింది. కాగా, రష్యా అధికారులు కరోనా మరణాలకు తక్కువగా చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మహమ్మారి వల్ల దేశంలో 3,07,948 మంది మరణించారని కరోనాపై నియమించిన ప్రభుత్వ టాస్క్ఫోర్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. గత 11 నెలల్లో దేశ జనాభా 9 లక్షల 45 వేలు తగ్గింది. గతేడాది ఇది 5 లక్షల 74 వేలుగా ఉన్నది.
రష్యాలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపడంలేదు. దీంతో కేసులతోపాటు మరణాల సంఖ్య భారీగా ఉంటున్నది. అయితే దేశీయంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ విసృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ 45 శాతం మందిమాత్రమే టీకా తీసుకోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

