Bomb blast: ఆఫ్ఘనిస్థాన్‌లో కారు బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం
Bomb blast: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతున్నది. ఇవాళ మరోసారి కాబూల్‌లో బాంబు పేలుడు కలకలం రేపింది.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతున్నది. ఇవాళ ఉదయం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనను మరువకముందే.. మరోసారి కాబూల్‌లో బాంబు పేలుడు కలకలం రేపింది. హజారా తెగకు చెందిన వ్యక్తులే లక్ష్యంగా కారులో బాంబులు పెట్టి పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలైనట్లు చెప్పారు. ఘటన బాధ్యులు ఎవరనేది తెలియాల్సి ఉందన్నారు.
కాగా, ఈ ఉదయం జరిగిన పేలుడుకు కూడా బాధ్యులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ మధ్య ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులే ఎక్కువగా పేలుళ్లకు పాల్పడుతుండటంతో ఈ పేలుడుకు కూడా వాళ్లే బాధ్యులై ఉంటారని ఆఫ్ఘన్ పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం చోటుచేసుకున్న బాంబు పేలుడులో 7 మంది ప్రాణాలు కోల్పోగా, ఉదయం పేలుడులో నలుగురు మృతిచెందినట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

