మెక్సికో సిటీ: మెక్సికోలోని (Mexico) సియుడాడ్ ఓబ్రెగాన్లో కాల్పుల (Shooting) మోతమోగింది. శుక్రవారం రాత్రి సియుడాడ్ ఓబ్రెగాన్లో జరుగుతున్న ఓ పార్టీలోకి చొచ్చుకెళ్లిన ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆరుగురు మరణించగా, మరో 26 మంది గాయపడ్డారు. ముతుల్లో ఇద్దరు 18 ఏండ్లలోపు వారు ఉన్నారని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలో నలుగురు కాల్పులు జరిపారని చెప్పారు. పార్టీ ప్రారంభమైన కొద్దిసేపటికే ముగ్గురు ఆంగతకులు అక్కడికి వెళ్లారని, అప్పటికే మరొకరు పార్టీలోనే ఉన్నారని తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, మరో 13 మంది చికిత్స అనంతరం దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారని వెల్లడించారు. కాగా, పోలీసులు కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగా, మరో ముగ్గురు పరారయ్యారు.