Earth Quake inTaiwan | తైవాన్ తూర్పు కోస్తా తీరంలో శనివారం భారీ భూకంపం చోటు చేసుకున్నది. రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో కోస్తా తీర నగరం తైతంగ్కు 50 కిలో మీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.
దీనివల్ల ఎటువంటి ప్రాణ హాని, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక మీడియా పేర్కొంది. తైవాన్ దేశమంతటా ప్రకంపనలు సంభవించాయి. భవనాలు స్వల్పంగా కదిలిపోయాయని తైవాన్ సెంట్రల్ వాతావరణ బ్యూరో వెల్లడించింది. రాత్రి భూమి కంపించడంతో తైవాన్ వాసులు భయ కంపితులయ్యారు.
తైవాన్ సెంట్రల్ వాతావరణ బ్యూరో స్పందిస్తూ రిక్టర్ స్కేల్‌పై 6.4 గా పేర్కొన్నా, 7.3 కిలోమీటర్ల లోతున సంభవించిందని తెలిపింది. తైవాన్‌లో నిరంతరం భూకంపాలు సంభవిస్తుంటాయి. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైతేనే సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సునామీ హెచ్చరికలు జారీ చేయడం లేదని తైవాన్ ప్రకటించింది.