ఇండోనేషియాలో భూకంపం : 8 మంది మృతి
భూకంపం | ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైందని జాతీయ విపత్తు సంస్థ

జకార్తా : ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైందని జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. ఈ భూకంప ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1,189 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లుమాజాంగ్, మలంగ్, బ్లిటర్, జెంబర్, ట్రెంగ్లక్‌లో భారీగా నష్టం సంభవించింది. హెల్త్ సెంటర్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. నివాసాలు కోల్పోయిన ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్వాసితులందరికీ ఆహారం, న్యూడిల్స్, బ్లాంకెట్స్ తో పాటు ఇతర సామాగ్రిని అందజేశారు.
సులవేసి ద్వీపంలోని పలులో 2018లో సంభవించిన భూకంప ధాటికి, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొందరు గల్లంతు అయ్యారు. నాడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. 2004, డిసెంబర్ 26న సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ రావడంతో 2,20,000 మంది చనిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్రజలు 1,70,000 ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

