ఒంటారియో: కెనడాలోని (Canada) ఉత్తర ఒంటారియోలో (Northern Ontario) తుపాకీ కాల్పుల్లో (Gun shot) ఐదుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు చిచన్నారులు కూడా ఉన్నారు. మంగవారం రాత్రి 10.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఒంటారియోలోని టాన్క్రెడ్ స్ట్రీట్‌లో (Tancred Street) ఉన్న రెండు ఇండ్లలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో షూటర్ సహా ఐదుగురు వ్యక్తులు మరణించారని కెనడా పోలీసులు తెలిపారు.
మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో టాన్క్రెడ్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగాయని తమకు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు. మరో పది నిమిషాల తర్వాత ఆ ఇంటికి సమీపంలోని నివాసంలో మరోసారి కాల్పులు జరిగినట్లు మళ్లి కాల్ వచ్చిందన్నారు. ఘటనా స్థలంలో ఓ మధ్యవయస్కునితోపాటు ముగ్గురు పిల్లల మృతదేహాలను గుర్తించామని వెల్లడించారు. వారికి సమీపంలోనే తనను తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.