మాస్కో : రష్యాలో రక్తపుటేరులు పారాయి. ఇన్హెవెస్క్ సిటీలోని ఓ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు స్కూల్ సెక్యూరిటీ గార్డ్స్, ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. స్కూల్ విద్యార్థులపై కాల్పులు జరిపిన దుండగుడు తనకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని రష్యా విచారణ కమిటీ టెలిగ్రామ్ ద్వారా ధృవీకరించింది. రష్యాలో కాల్పుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.